Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Mahayogama    Chapters   

ఓం నమో భగవతే శ్రీరమణాయ

మహా యోగము

(ఉపనిషద్దర్శనము)

రచయిత

''ఎవరు''

By 'WHO'

ఆంగ్లమూలము :

[ Maha yoga (Upanishadic Lore)]

ఆంధ్రానువాదము :

రామచంద్ర కౌండిన్య

14-4-81 - 19-7-81

ప్రకాశకులు :

టి. ఎన్‌. వెంకటరామన్‌

ప్రెసిడెంటు-బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌

శ్రీరమణాశ్రమము

తిరువణ్ణామలై : 606 603.

దుర్మతి

వైశాఖ శు ೧೧ గురువారం

ఆషాఢ బ ఆదివారం

సర్వస్వామ్యములు : ప్రకాశకులవి

ప్రధమ ముద్రణము : ఉగాది - ప్రభవ - 1987

ప్రతులు : 1000

మూల్యము : రూ. 15 - 00

ముద్రాపకులు :

పి. రామకృష్ణమూర్తి

వెల్‌కం ప్రెస్‌ పై#్రవేట్‌ లిమిటెడ్‌

బ్రాడీపేట, గుంటూరు. 522 002, ఫోను : 31086.

ఓమ్‌

తొలి పలుకు

నిజంగా మననైజమేమో కనుగొనేందుకు ఋజువైనమార్గం మహాయోగము. యోగమంటే సామాన్యంగా అందరూ ఊహించే దానికీ ఈ మహాయోగానికీ ఏపోలికలూ లేవు. ఇది చాల సరళ##మైనది. దీనిలో రహస్యమేమీలేదు. ఇది కేవలం మన ఉనికీ, దాని యాధార్థ్యములకు సంబంధించింది. ఇంతకన్న సహజమైనది వేరేముంటుంది ?

ఈ మార్గ మవలంబించేవారిలో పేరియున్న విశ్వాసాలనూ, సిద్ధాంతాలనూ మహాయోగం వదల్చివేస్తుంది. క్రొత్తసిద్ధాంతాలకు పెనవై చేందుకు గాదు : అన్ని సిద్ధాంతాలకు అతీతమైన సత్‌ స్వరూపాన్ని విచారించేయత్న సాఫల్యానికై.

మహాయోగాన్ని ఒక విధమైన విస్మృతిగా కొందరు వర్ణించారు. దాన్ని అవలంబించి నతడు పూర్వం తానునేర్చినదాన్ని మఱవవలె, అది అంతా సాపేక్షజ్ఞానం : అజ్ఞానం. కాబట్టి అది మహాయోగానికి అవరోధం

ఉపనిషత్తులలోని బోధయంతా ఈ మహాయోగయాధార్థ్యమే. ఈ యోగంవల్ల తెలియగల సత్యం నిత్యమైనది. కాని అది యట్టిదిగా నానాట జీవిస్తున్న మహానుభావుల ప్రామాణ్యం కావలసివస్తున్నది. ఈ గ్రంధానికి ప్రాతిపదిక యిట్లు - ఔపనిషదమైన సత్యం కేవలం గురుముఖతః తెలియవలసిందే : కాని ఉపనిషత్తులవల్లగాదు. ఉపనిషత్తులు పదముల ప్రోవులు మాత్రమే. జీవద్గురువులన్ననో మనం నెమకే ఆ నిత్యసత్యం దాల్చిన ప్రత్యక్షమూర్తులే. అట్టి జీవద్గురువు మన యీనాళ్లలో అరుణాచలమహర్షి, భగవాన్‌ శ్రీరమణులు. వారి జీవితాన్ని సంగ్రహంగా యీ పుస్తకం మొదటి ప్రకరణంలో స్పృశించాను. ఈ రచనకు సంబంధించినవరకు వారిబోధ పరమప్రమాణం. ఉపనిషదర్థాలు ప్రాధాన్యతఃగౌణాలు, వారు ప్రవచించిన వానికి వ్యాఖ్యామాత్రాలు, వివరణాలున్నూ. ఆయోగివరిష్ఠులు ప్రవచించిన వానికి విరుద్ధంగా ఏవేని యీ రచనలో దొరలితే వానిని గ్రహించ నక్కఱలేదు.

రచయిత

 

Mahayogama    Chapters